తరగతి నాయకుడికి గమనిక
ప్రతి అంశమునకు సంబంధించిన వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి, ఆపై ఎవరైనా మరొకరు అంశము యొక్క వివరణను చదవనివ్వండి. మరియు తరగతిలో ఆ ప్రశ్నను క్లుప్తంగా చర్చించండి.
Search through all lessons and sections in this course
Searching...
No results found
No matches for ""
Try different keywords or check your spelling
1 min read
by Stephen Gibson
ప్రతి అంశమునకు సంబంధించిన వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి, ఆపై ఎవరైనా మరొకరు అంశము యొక్క వివరణను చదవనివ్వండి. మరియు తరగతిలో ఆ ప్రశ్నను క్లుప్తంగా చర్చించండి.
ఈ క్రింది అంశాలు సువార్తకు అవసరమైనవి. ఒక వ్యక్తిని వీటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా రక్షించబడటం సాధ్యమే. ఏదేమైనా, ఈ అంశాలలో దేనినైనా నిరాకరించడము ద్వారా సువార్త యొక్క పునాదిని తొలగించే అవకాశము ఉన్నది. ఈ ముఖ్యమైన వాటిలో దేనినైనా తిరస్కరించే వ్యక్తి లేదా సంస్థ రక్షణకు సరిగాని మార్గాలను నమ్ముతూ మరొక సువార్త అభివృద్ధికి దోహదపడును.
మీరు ఎవరితోనైనా సువార్తను పంచుకున్నప్పుడు, అతడు ఇప్పటికే నమ్మిన, లోపాల కారణంగా కొన్ని అంశాలు చాలా ముఖ్యమైనవి మరుగౌతాయి. ఉదాహరణకు, రక్షణ ఒక ఖచ్చితమైన సంస్థ లేదా సంఘము ద్వారా మాత్రమే అని అతడు విశ్వసిస్తే, రక్షణకు సంస్థ లేదా సంఘ సభ్యత్వము అవసరమని అతడు నమ్ముతాడు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దేవునితో ప్రత్యక్ష సంబంధంలోకి వస్తేనే క్షమాపణ పొందుతాడని అతడు తెలుసుకోవాలి.
(1) దేవుడు మానవాళిని తన పోలికలో సృష్టించాడు, తద్వారా దేవుడు అతనితో సంబంధాలు కలిగి ఉంటాడు (ఆదికాండము 1:27, అపొస్తలుల కార్యములు 17:24-28).
ఈ సత్యం మన ఉనికి యొక్క ఉద్దేశ్యం మరియు రక్షణ యొక్క లక్ష్యాన్ని చూపుతుంది. వ్యక్తిత్వం ఉన్న దేవుణ్ణి నమ్మని మతాలు ఈ సత్యానికి విరుద్ధముగా ఉన్నారు. ఈ సత్యం ప్రపంచంలో ఉన్న నిజమైన సమస్యను చూపిస్తుంది; ప్రజలు దేవునితో సంబంధంగల వారుగాలేరు.
► దేవుడు తనను ప్రేమిస్తున్నాడని ఒక వ్యక్తి నమ్మకపోతే ఏమౌతుంది ?
(2) మొదటి మానవుడు పాపం చేసి దేవుని నుండి విడిపోయాడు (ఆదికాండము 3:3-6).
ఇది పాపం యొక్క మూలం మరియు పాపలోక స్థితికి నిజమైన కారణమును చూపిస్తుంది. ప్రపంచంలో పాపం వల్ల బాధలు, దుఃఖం ఉన్నాయి. దేవుని రూపకల్పన వల్ల ఇంకా ఆనందం మరియు ఉద్దేశ్యం ఉంటుంది, కాని దేవుడు తను మొదట అనుకున్నట్లు ప్రపంచం లేదు.
► ప్రపంచానికి నిజమైన సమస్య పాపము అని ఒక వ్యక్తి నమ్మకపోతే?
(3) మనలో ప్రతి ఒక్కరూ దేవునితో సరియైన సంబంధం లేనివారముగా పుట్టాము మరియు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము (రోమా 3:10, 23).
ప్రతి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వక పాపానికి పాల్పడ్డాడు. ఏ వ్యక్తి ఎప్పుడూ సరైనది చేయ లేదు.
► ఒక వ్యక్తి అతడు చేసే విషయాలు న్యాయమైనవని ఆలోచించినట్లయితే?
(4) కనికరము పొందలేని ప్రతి పాపి దేవునిచే తీర్పు తీర్చబడతాడు మరియు అతడు నిత్యమైన శిక్షకు పాత్రుడౌతాడు (హెబ్రీయులకు 9:27, రోమా 14:12, ప్రకటన 20:12).
ఇది రక్షణ పొందుటకు పాపి యొక్క అవసరం యొక్క తీవ్రత మరియు అత్యవసరతను చూపిస్తుంది.
► ఒక వ్యక్తి, న్యాయవంతుడైన దేవుడు పాపము విషయమై కోపము గలవాడు అని నమ్మనట్లైతే?
(5) ఒక వ్యక్తి తాను దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు వెల చెల్లించటానికి ఏమీ చేయలేడు (రోమా 3:20, ఎఫెసీయులకు 2:4-9).
మంచి పనులు మరియు బహుమతులు పాపానికి వెల చెల్లించలేవు, ఎందుకంటే పాపం అనంతమైన దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది మరియు లోకములో ప్రతిదీ దేవునికి చెందినదే.
► ఒక వ్యక్తి తనకు తాను క్షమాపణ కొరకైన వెలను చెల్లించగలను అని నమ్ముతూ ఉంటే?
(6) పాపం తీవ్రమైనది మరియు దేవుడు నీతిమంతుడు గనుక క్షమించబడుటకు ఒక ఆధారం ఉండాలి (రోమా 3:25-26).
దేవుడు క్షమించాలని కోరుకుంటాడు కానీ, దేవుని ఆధారము లేకుండా క్షమించబడాలని కోరుకొంటే, పాపం స్వల్పవిషయం అనిపించవచ్చు, మరియు దేవుని అన్యాయస్థులుడుగా అగుపించవచ్చు.
► క్రీస్తు మరణం ఎందుకు అవసరం?
(7) దేవుని కుమారుడైన యేసు పాపములేని, పాపము చేయని జీవితాన్ని జీవించాడు మరియు మన పాపములకై బలిగా మరణించాడు గనుక మన పాపములు క్షమించబడగలవు (యోహాను 3:16, రోమా 5:8-9).
దేవుని కుమారుడైన యేసు యొక్క త్యాగం అనంతమైన విలువ కలిగి మరియు ప్రపంచంలోని ఎవరైనా క్షమించుటకు ఆధారమై ఉన్నది. ఆయన కేవలం ఒక మానవుడు మాత్రమే ఉండి ఉంటే, ఆయన త్యాగం పరిమితమైన విలువ కలిగి ఉండేది. యేసు రక్తం మనకొరకు అర్పించబడిన ప్రాణమును సూచిస్తుంది. రక్తము లేకుండా పాపక్షమాపణ కలుగదు. (హెబ్రీయులకు 9:22). ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే మనలను సంపూర్ణంగా రక్షించలేదు. మరియు, మనము నిరీక్షణ లేకుండా, మన కొరకు రక్షణకు మరొక మార్గము వైపు ఎదురు చూసేవారము.
► కొన్ని మతాల ప్రజలు క్రియల ద్వారా రక్షించబడగలము అని ఎందుకు అనుకుంటున్నారు?
(8) యేసు మృతులలోనుండి భౌతికంగా తిరిగి లేచుట ద్వారా దేవుని కుమారునిగా గుర్తింపు మరియు నిత్యజీవము నిచ్చుటకు శక్తిగలవాడుగా ఉన్నాడు (యోహాను 20:24-28, ప్రకటన 1:18).
దుర్భోధకులు యేసు యొక్క పునరుత్థానమును, నిరాకరిస్తే వారు ఆయన దైవత్వమును, మరియు రక్షణ కొరకు ఆయన చేసిన సమృద్ధి బలియాగమును నిరాకరించి, వారు రక్షణకు మరొక మార్గాన్నిస్వంతంగా కనిపెట్టుదురు.
► యేసు మృతులలోనుండి లేచినందున తెలిసిన విషయాలు ఏమి?
(9) అన్ని పాపముల క్షమాపణకు యేసు బలి సరిపోతుంది (1 యోహాను 1:9, 1 యోహాను 2:2).
ఒక వ్యక్తి ఈ సత్యాన్ని నిరాకరిస్తే, అతడు క్రియల సువార్తను, క్రియల ద్వారా రక్షణను విశ్వసిస్తాడు. ఒక వ్యక్తి తన రక్షణను పాక్షికంగా ఎలా సంపాదించగలడు అనే సందేశాన్ని చాలా మతాలు నమ్ముతాయి. ఇది ప్రజలను ఒక మత సంస్థ నియంత్రణలో ఉంచుతుంది, అది వారిని రక్షించడానికి ఏమి చేయాలో చెబుతుంది గాని రక్షంచజాలదు.
► కొంతమంది తమ మత సంస్థ లేకుండా తాము రక్షంచబడలేమని ఎందుకు అనుకుంటున్నారు?
(10) తాను పాపినని అంగీకరించి, పాపానికి పశ్చాత్తాపపడి, క్షమించమని దేవుని వాగ్దానాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తిని దేవుడు క్షమించును (మార్కు 1:15, 1 యోహాను 1:9).
రక్షణకు అవసరాలను దానిని జోడించడానికి లేదా రక్షణకు వేరే మార్గాలను చూపించే హక్కు ఏ మానవ సంస్థకు లేదు.
► ఎలాంటి వ్యక్తి తాను రక్షించబడ్డానని చెప్పే హక్కు ఉంటుంది?
(11) పశ్చాత్తాపం అంటే ఒక వ్యక్తి తన పాపాలకు క్షమాపణ వేడుకొని, తన పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు (యెషయా 55:7; యెహెజ్కేలు 18:30, యెహెజ్కేలు 33:9-16; మత్తయి 3:8).
పశ్చాత్తాపం అంటే దేవుడు తనను అంగీకరించే ముందు ఒక వ్యక్తి తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలిని కాదు; దేవుడు మాత్రమే ఒక పాపిని తన పాపాల శక్తి నుండి విడిపించగలడు. పశ్చాత్తాపం అనగా ఒక వ్యక్తి తన పాపాల కోసం పశ్చాత్తాపపడి తన పాపాలను విడిచి పెట్టడానికి సిద్ధంగా ఉండడం.ఒక వ్యక్తి తన పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే, అతడు రక్షించబడలేడు. ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా పాపము చేస్తూ ఉంటే రక్షణ పొందలేడు.
► పశ్చాత్తాపం ఎందుకు అవసరం?
(12) పశ్చాత్తాపపడుతున్నవ్యక్తి, నమ్మిన పాపి దేవుణ్ణి ప్రార్థిస్తూ, తనను క్షమించమని దేవుడిని కోరినప్పుడు క్షమాపణ పొందుతాడు (రోమా 10:13, అపొస్తలుల కార్యములు 2:21).
ప్రతి వ్యక్తికి యేసు వల్ల దేవుని కృప లభిస్తుంది. ఒక వ్యక్తి దేవుని క్షమాపణ పొందటానికి ఏ సంస్థ లేదా మానవ నాయకత్వం అవసరం లేదు. ఒక వ్యక్తి క్షమాపణను వ్యక్తిగతంగా స్వీకరిస్తాడు మరియు దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని ప్రారంభిస్తాడు.
► ఒక వ్యక్తి క్షణ కాలములో, నమ్మిన క్షణములోనే క్రైస్తవుడు కాగలడని మనకు ఎలా తెలుసు?
(1) మీరు మారుమనస్సు పొందిన సమయంలో ఈ పాయింట్లలో ఒకటి లేదా రెండు మీకు ఎలా ముఖ్యమైనవి అని అర్థమైనదో కొన్ని పేరాల్లో వివరించండి.
(2) ఒక దుర్బోధ లేదా క్రైస్తవేతర మతమును ఎంచుకోండి దానిని పరిశోదించండి. – అవి సువార్తలో ముఖ్యమైన విషయాలను ఎలా విభేదిస్తాయో 2-3 పేజీలలో వివరించండి. వారు బోధించే సరిగాని సువార్తను వివరించండి మరియు అది ఎలా తప్పు సిద్ధాంతాలపై ఆధారపడి ఉందో చూపించండి. సత్యానికి మీరు వారికి లేఖనాత్మక ఆధారాలు ఎలా ఇస్తారో వివరించండి.
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.
Questions? Reach out to us anytime at info@shepherdsglobal.org
Total
$21.99By submitting your contact info, you agree to receive occasional email updates about this ministry.
Download audio files for offline listening
No audio files are available for this course yet.
Check back soon or visit our audio courses page.
Share this free course with others